తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

సెల్వి

శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (19:30 IST)
Pawan kalyan
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం- హిందూ సంప్రదాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంలో, ఆయన ఇటీవల తమిళనాడు, కేరళలకు ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. అక్కడ ఆయన అనేక పురాతన దేవాలయాలను సందర్శించారు.
 
తమిళనాడు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి- తమిళనాడులోని ఆలయ పట్టణం పళని మధ్య ప్రసిద్ధ బస్సు సర్వీసును కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిలిపివేసినట్లు తెలుసుకున్నారు. ఈ సర్వీసులను పునః ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తిరుపతి-పళని మధ్య ఈ బస్సు సర్వీసు పునఃప్రారంభించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పట్టుదల కారణంగా ఈ కొత్త ఆర్టీసీ సేవలు.. ప్రస్తుతం తిరుపతి-పళని ఆలయ పట్టణాల మధ్య నడుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు