వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, కేసు చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి వైఎస్ షర్మిల సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన నిందితుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా బెయిల్‌పై బయట ఉండటంతో వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ కేసులో కీలక సాక్షులు, నిందితులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని, దీనివల్ల సునీత ప్రాణాలకు మరింత ప్రమాదం ఏర్పడిందని ఆమె ఆరోపించారు.
వివేకా హత్య జరిగినప్పుడు సునీత లేదా ఆమె భర్త అక్కడ లేరని, అవినాష్ రెడ్డి మాత్రమే సంఘటన స్థలంలో ఉన్నారని షర్మిల గుర్తు చేశారు. వివేకా గుండెపోటుతో మరణించారని అవినాష్ చెప్పారని, వాస్తవానికి ఆయన హత్యకు గురయ్యారని ఆమె ఆరోపించారు.
అవినాష్ మొదటి నుంచి దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని, బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, కేసును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని షర్మిల ఆరోపించారు. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే నిజం ఎలా బయటపడుతుందని ఆమె ప్రశ్నించారు.