పవన్ వీరాభిమాని ఆత్మహత్య.. అంత్యక్రియలకు పవర్ స్టార్ రావాలని?

మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:53 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలో టాల్‌వాకర్స్‌ జిమ్ ట్రైనర్ అయిన అనిల్ చనిపోయే ముందు అనిల్ పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశారు. తన ఆత్మశాంతి కోసం పవన్‌ కల్యాణ్‌ తనను చూసేందుకు రావాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా అన్నయ్య చేతుల మీదుగా అంత్యక్రియలు జరగాలని బతికుండగా దగ్గర నుంచి చూడలేకపోయాయని లేఖలో తెలిపారు. 
 
గత కొంతకాలంగా అతడు తీవ్ర ఒత్తిడిలో వుండిన అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో జనసేన నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో కార్యకర్తగా సేవలందించాడు. చనిపోయే ముందు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఓ లేఖ రాసిన అనిల్ కుమార్, తన మరణాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని కోరాడు. 
 
తాను చనిపోయిన తరువాత, చూసేందుకు పవన్ రావాలని, ఆయన చేతుల మీదుగానే తన అంత్యక్రియలు జరగాలని అనిల్ కోరుకున్నాడు. పవన్ తప్పకుండా వస్తారనే భావిస్తున్నట్టు లేఖలో రాసుకున్నాడు. అనిల్ కుమార్ ఆత్మహత్యతో విజయవాడలోని అతని కుటుంబీకులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు