ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని ఉద్ఘాటించారు.
దేశంలో అంధకారం తొలగిపోవాలంటే సాహసం ఉండాలని, అలాంటి సాహసం ఉన్నవాళ్లే మత్స్యకారులు అని, మత్స్యకారుల కులాలు ఉత్పత్తి కులాలు అని వివరించారు.
జనసేనను బెదిరించాలని చూసే నాయకులకు ఒకటే చెబుతున్నా... మీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడదు అని స్పష్టం చేశారు. సంయమనం పాటిస్తున్నానంటే అది తమ బలం అని, బలహీనత కాదని ఉద్ఘాటించారు. గొడవలు పెట్టుకునేందుకు చాలా ఆలోచిస్తామని అన్నారు.