చావనైనా చస్తాను.. ఎవరికీ తలవంచను : పవన్ కళ్యాణ్

సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (08:31 IST)
తాను చావనైనా చస్తాను గానీ ఎవరికీ తలవంచనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం జరిగిన మత్య్సకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జనసేనను చూసి బెదిరించాలని చూసే నాయకులకు ఒక్కటే చెబుతున్నా.. మీ పిచ్చి వేషాలకు జనసేన భయపడదు అని స్పష్టంచేశారు. సంయమనం పాటిస్తున్నానంటే అది తమ బలం.. బలహీనత కాదన్నారు. గొడవలు పెట్టుకునే ముందు చాలా ఆలోచన చేస్తానని ప్రకటించారు. 
 
ఒక నిర్ణయం తీసుకునేముందు, ఒక పని చేసేముందు పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తల భవిష్యత్, భద్రత గురించి ఆలోచన చేస్తానని ఆయన వెల్లడించారు. మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, ఇదే విధంగా హింసిస్తే రోడ్డుపై ఏ స్థాయికైనా దిగి పోరాడుతానని ఆయన ప్రకటించారు.
 
మత్య్సకారులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేనద్నారు. ఈ జీవో ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమితం కాదని, తీరప్రాంతంలో ఉన్న మత్య్సకార గ్రామాలన్నింటికి వర్తిస్తుందని తెలిపారు. అందువల్ల ఈ జీవోను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలో 32 మత్స్యుకార ఉపకులాలు ఉన్నాయని, రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్య్సకారులు ఉన్నారని, వారి కష్టాల తనకు బాగా తెలుసున్నారు. జనసేనను గనుక ఒక్క 10 మంది ఎమ్మెల్యేలు ఉండివుంటే జీవో 217ను ఇచ్చేందుకు ప్రభుత్వం సాహసం చేసి వుండేదికాదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు