పెట్టుబడుల వేటలో పవన్ కళ్యాణ్ : వాషింగ్టన్‌లో పర్యటన

గురువారం, 13 డిశెంబరు 2018 (09:30 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి పునరుజ్జీవనం కల్పించేందుకు వీలుగా పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆయన ఈ తరహా పర్యటనలకు నడుంబిగించారు. ఇందులోభాగంగా, ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్‌లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, తమ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లు వాషింగ్టన్‌లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటీ బెన్ కార్సన్‌తో సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశం అనంతరం పవన్ మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకుగల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సన్‌తో చర్చించానని తెలిపారు. రానున్న 2019 ఎన్నికల్లో పవన్ పోటీలోకి దిగనున్న నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాలలో పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. 
 
దీంతో రానున్న ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే తీసుకొవాల్సిన జాగ్రత్తలు... దానికి కావాల్సిన పెట్టుబడుల విషయంలో ఇప్పటినుండే పవన్ ముందస్తుగా అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితరులతో ఆయన భేటీ అయినట్లుగా భావించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు