ఇది మోదీ వాగ్దానం.. జైలుకు వెళ్తారు.. పవన్ పోస్ట్ వైరల్

సెల్వి

శనివారం, 13 ఏప్రియల్ 2024 (10:02 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. మోదీ ప్రసంగానికి సంబంధించిన హెడ్‌లైన్‌తో కూడిన ఆంగ్ల దినపత్రికను చూస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. "ఇది మోదీ వాగ్దానం.. అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్తారు" అని హెడ్‌లైన్‌ రాసి ఉంది.
 
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఈ హెడ్డింగ్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తానని గౌరవప్రదమైన ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
 
వైఎస్సార్సీపీ.. ఇది మీ ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంది. అయితే ఇది ఎన్నికలకు ముందు జరుగుతుందా, తర్వాత జరుగుతుందా అనేది నా ప్రశ్న. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, బీజేపీ, టీడీపీ, జనసేనతో సహా ఎన్డీయే ప్రభుత్వం రాక కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు" అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు