సీఎం జగన్ కూతురు మాత్రం చదువుకుంటోంది.. పవన్ కల్యాణ్

సోమవారం, 4 జులై 2022 (14:47 IST)
ఏపీ సీఎం జగన్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. మాట ఇస్తే మడమ తిప్పననే వాళ్లు విదేశాల్లో తిరుగుతున్నారు.. రాజకీయం అంటే బూతులు తిట్టడం కాదని పవన్ ఫైర్‌ అయ్యారు. 
 
వాలంటీర్లు సంతకం పెట్టని కారణంగా కూడా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉందని పవన్ చెప్పారు. 
 
ముద్దుల మామయ్య అని చెప్పిన సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారన్నారు పవన్. కానీ ఇప్పుడేమో ఆ ముద్దుల మామయ్య ఫీజు చెల్లించడం లేదని.. విదేశీ విద్య ఆపేశారు. ఫీజు రీయింబర్సుమెంట్ చేయడం లేదని విమర్శలు చేశారని తెలిపారు.
 
సీఎం జగన్ కూతురు మాత్రం చదువుకుంటోందని, సీఎం కూతురు గురించి మాట్లాడటానికి సంస్కారం అడ్డొస్తోంది.. నేను మాట్లాడననన్నారు పవన్‌. 
 
గురజాలలో సీఎం జగనుకు చెందిన సరస్వతి పవర్ అండ్ మినరల్స్ సంస్థ భూములు తీసుకుంది.. పరిహరం ఇవ్వలేదనే ఫిర్యాదు చేశామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు