పవన్ కళ్యాణ్ స్థానం ఖాయం...

మంగళవారం, 12 మార్చి 2019 (16:27 IST)
ఎన్నికలు సమీపిస్తుండటంతో దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్నాయి. అభ్యర్థుల విషయం ఎలా ఉన్నా జనసేన తప్ప దాదాపు అన్ని పార్టీల అధినేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేసే విషయం ఇప్పటి వరకు నిర్ధారించలేదు.
 
తాజాగా మంగళవారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయం వెల్లడించినట్లు సమాచారం. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో తీసుకున్నట్లు సమాచారం.
 
అయితే విశాఖ ఉత్తరం నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తుండగా పవన్ కళ్యాణ్ కాడా గాజువాక నుంచి పోటీకి దిగితే విశాఖలో ఎన్నికలవేడి విపరీతంగా ఉండనుంది. మరోవైపు వైసీపీ కూడా విశాఖలో ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో ఉండటంతో ఈ ఎన్నికల్లో అందరి కళ్లూ విశాఖ మీదే ఉంటుందనడంలో సందేహం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు