పిఠాపురంపై ఈగ వాలనీయని పవన్.. విద్యార్థుల కష్టాలు తెలిసి కంప్యూటర్లు (video)

సెల్వి

గురువారం, 17 అక్టోబరు 2024 (14:36 IST)
Pawan kalyan
పిఠాపురం నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిఠాపురం ప్రజలపై ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విధ్యార్ధినులకు కంప్యూటర్లు అందజేసేలా అధికారులను ఆదేశించారు. 
 
గత కొన్నేళ్లుగా కంప్యూటర్ సైన్స్ శిక్షణ అందించేందుకు కంప్యూటర్లు అందుబాటులో లేవనే విషయాన్ని ఇటీవలే పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా సమస్యల అధ్యయనం కోసం వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, పేషి అధికారుల బృందం గుర్తించింది. 
 
ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. పేషి నివేదిక ప్రకారం.. పవన్ కల్యాణ్, వెంటనే కళాశాలకు అవసరమైన కంప్యూటర్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ క్రమంలో రూ.1.1 లక్షలను సీఎస్సార్ నిధుల సహకారంతో కళాశాల యాజమాన్యానికి అప్పగించారు. విధ్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చదువుకునే పరిస్థితులు ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు తెలిపారు.

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విధ్యార్ధినులకు గత కొన్నేళ్లుగా కంప్యూటర్ సైన్స్ శిక్షణ అందించేందుకు కంప్యూటర్లు అందుబాటులో లేవనే విషయాన్ని ఇటీవలే పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా సమస్యల అధ్యయనం కోసం వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, పేషి అధికారుల బృందం… pic.twitter.com/NGOyhAs5RF

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు