ప్రత్యేకహోదాపై ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే తిరగబడతామని ఆంధ్రప్రదేశ్ యువత కేంద్రానికి తెలియచెప్పాలని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై జల్లికట్టు తరహా ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపాడు.
కానీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే, అంటే మంగళవారం పవన్ కల్యాణ్ పోస్టర్ విడుదల చేశారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు ఆల్బం ద్వారా జనసేన తన గొంతుకను వినిపిస్తుందని తెలిపారు.