పవన్ కళ్యాణ్‌కు బేతంపూడి గ్రామస్థుల కృతజ్ఞత.. కాలనీకి పవర్ స్టార్ పేరు!

శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (18:33 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు గుంటూరు జిల్లా బేతంపూడి గ్రామస్థలు తమదైనశైలిలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీకి పవన్ కళ్యాన్ నగర్ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అయితే, ఈ గ్రామస్తులు తమ భూములిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టాలని నిర్ణయించి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించింది. దీంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి బేతంపూడి, పెనుమాక తదితర గ్రామాలవాసులకు అండగా నిలిచారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఈ గ్రామానికి వచ్చి రైతుల సమస్యలను సావధానంగా విన్నారు. 
 
దీనికి కృతజ్ఞతగా, బేతంపూడి గ్రామస్థులు తమ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీకి పవన్ కళ్యాన్ నగర్ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. తమకు అండగా నిలిచినందుకు ఆ గ్రామస్తులు తమ అభిమానాన్ని ఇలా చాటుకొన్నారు. రైతులకు బాసటగా పవన్ నిలవడంతో ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో వెనుకడుగు వేసిన నేపథ్యంలో పవన్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా బేతంపూడి గ్రామస్థులు తమ కాలనీకి పవన్ కళ్యాణ్ నగర్ అని పేరు పెట్టడం జరిగిందని అంటున్నారు. దీంతో స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత అంతటి అరుదైన గౌరవం దక్కించుకున్న హీరో పవన్ కళ్యాణ్ అయ్యాడు.

వెబ్దునియా పై చదవండి