ప్రధానమంత్రి నరేంద్ర మోడీని షాక్‌కు గురిచేసేలా హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. మన భాష, జాతి, సంస్కృతులను కేంద్రం గౌరవించలేక పోతే, మన దేశ సమగ్రతను కాపాడలేకపోతే వేర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసినట్టే అవుతుందని ట్వీట్ చేశాడు. అంతకుముందు ఉత్తరాది పెత్తనం వద్దని కూడా పేర్కొన్నాడు.
హిందీ భాషను బలవంతంగా దక్షిణాది రాస్ట్రాలపై రుద్దాలని చూడటం సరికాదని కేంద్రానికి పవన్ హితవు పలికారు. మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని మోడీ చేసిన సూచన నేపథ్యంలో 'హిందీ గో బ్యాక్' అంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని పవన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఉత్తరాది నాయకులు ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దేశంలోని భిన్నసంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరాడు.