స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి యువతీ యువకులంతా ఆహ్వానితులేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని యువగళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందని తెలిపారు.
దేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని చెప్పారు. అయితే, ఉత్తారాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధఇ అవకాశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొనివుందన్నారు.
ఈ నేపథ్యంలో వలసలు, విద్య, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభలో తాము మాట్లాడటం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.