పవన్ కళ్యాణ్‌ ఎందుకలా మాట్లాడారు.. అసలేమైంది..?

మంగళవారం, 25 జూన్ 2019 (21:37 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్రం సంపాదించుకోవడంలో అందరూ భాగస్వామ్యులయ్యారు. అది యూనిటీ అంటే.
 
మన ఆంధ్రప్రదేశ్ ప్రజలున్నారు. ప్రత్యేక హోదా విషయంలో అంతటి ఆకాంక్షను చూపలేకపోతున్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు ఎన్నోసార్లు మాట్లాడినా ప్రజల నుంచి సరైన నిరసన రాలేదు. ప్రజల నుంచి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో తామేమీ చేయలేమని పవన్ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ఆంధ్ర ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరూ ఏమీ చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
ప్రత్యేక హోదా పోరాటం నుంచి తప్పుకునేందుకే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో ప్రజలు, ప్రతిపక్షపార్టీగా ఉన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం మొక్కవోని దీక్షతో పోరాటం చేసి హోదా ఆశలకు సజీవంగా ఉంచారు. ఎపి ప్రజలు అనేక సంధర్భాల్లో ప్రత్యేక హోదా కోసం తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా విమర్సలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎందుకిలా జనసేనాని మాట్లాడుతున్నారని సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు