పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

ఠాగూర్

సోమవారం, 28 జులై 2025 (22:27 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ఆయన సినిమాల్లోకి రాకముందు తమిళనాడులోని దివంగత కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేన్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సమయంలో పవన్‌కు రెన్షి రాజాతో పరిచయం ఏర్పడింది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత పవన్‌ను రెన్షి రాజా కలిశారు. దీనిపై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 
 
తమిళనాడుకు చెందిన రెన్షి రాజాను 34 యేళ్ల తర్వాత సుధీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకోవడం ఆనందం కలిగించింది. 1990ల ప్రారంభంలో స్వర్గీయ షిహాన్ హుస్సేని కరాటే స్కూల్‌లో రెన్షి రాజా తన సీనియర్‌గా ఉన్నారని గుర్తుచేశారు. 
 
తాను గ్రీన్ బెల్ట్ సాధించిన సమయంలో రెన్షి రాజా బ్లాక్ బెల్ట్ సాధించారని పేర్కొన్నారు. షిహాన్ హుస్సేని ఆశయాలను రెన్షి రాజా ముందుకు తీసుకెళుతూ తాము శిక్షణ పొందిన పాఠశాలకు ఇపుడు నాయకత్వం వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ పేర్కొన్నారు. 
 
ఈ సమావేశంలో షిహాన్ హుస్సేనితో తమకున్న చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మార్షల్ ఆర్ట్స్ పట్ల తమకున్న ఉమ్మడి అభిరుచి గురించి చర్చించుకోవడం అనేక మధుర జ్ఞాపకాలను తిరిగి తెచ్చిందని పవన్ కళ్యాణ్ వివరించారు. తాజాగా రెన్షి రాజాతో కలిసి కరాటే ప్రాక్టీస్ ఫోటోలను కూడా పవన్ పంచుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు