చేనేత కార్మికులు గుంటూరులో చేసిన సత్యాగ్రహానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టాల్లో వున్న చేనేత కార్మికుల కోసమే ఇక్కడికి వచ్చానన్నారు. ఇంకా ''నన్ను చేనేత కళాకారులకు మద్దతిస్తే ఒకాయన విస్తరాకులు ఏరుకునేవాళ్లతో నన్ను పోల్చడం గర్వంగా ఉంది. అవి ఏరేవారే లేకపోతే కోటీశ్వరులైనా విలవిలలాడుతారు. కోట్ల సంపాదన నాకేమీ తృప్తి ఇవ్వదు. నేను అధికారం కోసం రాలేదు.
2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను. కష్టాలు పడుతున్నవారి గొంతు వినిపించేందుకే నేను అసెంబ్లీకి వెళతా. నేను మెడలో వేసుకున్న ఈ ఎర్రటి తుండు గబ్బర్ సింగ్‌ది కాదు, ఇది సామాన్యుడి శక్తి. వారసత్వ రాజకీయాల పట్ల నాకు వ్యతిరేకత ఏమీలేదు. యువ నాయకుల కోసం ఎదురుచూస్తున్నాను. తుపాకులు ఎదురొచ్చినా ఎదుర్కొనే దమ్మున్న నాయకులు కావాలి. మార్చి 14న జనసేన పాలసీలు సిద్ధం చేయబోతున్నాను" అని చెప్పారు.