చెల్లెమ్మ కవితకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (10:25 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కల్యాణ్ టీఆర్ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఏపీ హక్కుల కోసం ఏకమయ్యారు. ఏపీ హక్కులపై పార్లమెంట్‌లో కవిత మాట్లాడటంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేసారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంట్‌లో మాట్లాడిన చెల్లెమ్మ కవిత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏపీకి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఏపీ ఎంపీలు చేస్తోన్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. 
 
మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎంపీలే ఆందోళన కార్యక్రమాలు చేపడితే.. ప్రజల్లో ప్రతికూల ప్రభావం తప్పదని హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. ఇంకా జై ఆంధ్రా అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల పవన్ హర్షం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు