పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడకు బయలుదేరి వచ్చారు. పార్టీ నాయకులతో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన విజయవాడ వచ్చిన జనసేనాని, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.
రేపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, జెండా ఎగరవేయనున్నారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు విజయవాడ పార్లమెంట్... మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోగల అసెంబ్లీ సెగ్మెంట్లలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.