కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చనిపోయాయని వచ్చిన వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ - పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్, అటవీ శాఖ సీనియర్ అధికారులను దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ అరుదైన జాతుల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణాలపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.