పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

సెల్వి

శనివారం, 28 డిశెంబరు 2024 (20:38 IST)
Divvela Madhuri
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్ కామన్‌ మ్యాన్‌గా జనసేన పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో పవన్ వైకాపా నేతల్లారా రండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. వైకాపా నేతగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. 
 
వైకాపా తరపున మాట్లాడారు. అంతేకానీ ఆయన ఇంకేమీ చేయలేదు. అలా వైకాపా తరపున మాట్లాడటంతో తప్పేమీ లేదు. ఆ వ్యాఖ్యలను గుర్తు పెట్టుకుని ప్రస్తుతం కేసులు పెట్టడం సరికాదని.. ఆ కేసుల సాకుతో అరెస్టులు చేస్తే మాత్రం నిరసనలు తప్పవని.. రాజాను అరెస్ట్ చేసి చూడండి అంటూ దివ్వెల మాధురి హెచ్చరించారు. 
Divvela Madhuri
 
దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేస్తే.. ఆయన అభిమానులు రోడ్డున పడతారని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ సర్కారుతో మాట్లాడేది లేదని.. ఏం జరిగినా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ఇంకా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించిన దివ్వెల మాధురి.. యాంకర్ కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్సుకు శ్రీనివాస్‌తో పాటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

ఒక్కసారి నా రాజాని అరెస్ట్ చేసి చూడండి .. పవన్ కు దివ్వెల మాధురి వార్నింగ్..@PawanKalyan @JanaSenaParty #DivvelaMadhuri #DuvvadaSrinivas #YSRCongress #RTV pic.twitter.com/4bjmSeoJjk

— RTV (@RTVnewsnetwork) December 28, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు