ఏపీ మంత్రివర్గ విస్తరణలో తనకు బెర్తు ఖరారు చేస్తారని గంపెడు ఆశలుపెట్టుకున్న ఎమ్మెల్యేల్లో విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే (రిజర్వుడ్) వెంగలపూడి అనిత ఒకరు. అయితే, గత ఆదివారం చంద్రబాబు చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆమెకు మొండిచేయి చూపించారు.
తమ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి పదవి చేజారిపోయిందని బాధపడుతున్న కార్యకర్తలను సముదాయిచడం కష్టమైన పని అంటూ ఆమె తనలోని అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా, మంత్రి పదవిని ఇవ్వలేక పోవడంతో అనితతో చంద్రబాబు మాట్లాడినట్లు వినికిడి. నిరాశ చెందొద్దని, అండగా ఉంటానని చంద్రబాబు అనితకు హామీ ఇచ్చారు.