సోషల్ ఆడిట్ జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన అనంతరం అనర్హులుగా ప్రకటించిన వారిని మరొకసారి పూర్తిస్థాయిలో పరిశీలించిన పిమ్మట అర్హులైతే వారికి కూడా పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో పి. రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అందజేస్తున్న అన్ని రకాల పెన్షన్లను ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగా సోషల్ ఆడిట్ లో అర్హులుగా నిర్ధారణ అయిన లబ్ధిదారులకు ఈనెల పెన్షన్ మరియు వచ్చే నెల పెన్షన్ ను ఒకేసారి అందజేయడం జరుగుతుందని సీఈవో వెల్లడించారు.