విశాఖపట్నం: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి, విశాఖపట్నంలోని ఫైజర్ గ్లోబల్ సప్లై తయారీ యూనిట్, విశాఖపట్నంలోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం చేసుకుంది. ఈరోజు, వారు 'ఫైజర్ అటానమస్ టీమ్స్' (PAT) కార్యక్రమంలో భాగంగా మహిళా సహోద్యోగుల మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్‌ను ప్రకటించారు. ఈ 36 నెలల కార్యక్రమంలో భాగంగా అట్టడుగు స్థాయిలోని మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సైన్స్ సంబంధిత రంగాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం మధ్య ఈ పరిశ్రమ-విద్యా భాగస్వామ్యంలో భాగంగా చేపట్టిన ఒక కార్యక్రమం, 'ఫైజర్ అటానమస్ టీమ్స్'. 'అభ్యసిస్తూనే సంపాదించే' అవకాశాన్ని ఇది వారికి అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, స్థానిక మహిళా విద్యార్థులను తమ తయారీ యూనిట్ సిబ్బందితో చేరడానికి ఫైజర్ అవకాశమిస్తుంది, అదే సమయంలో గీతం విశ్వవిద్యాలయంలో వారి విద్యను కొనసాగించడానికి తగిన మద్దతు ఇస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 44 మంది మహిళా విద్యార్థులతో కూడిన మొదటి బృందం, మైక్రోబయాలజీలో ప్రత్యేకత కలిగిన బిఎస్సి కెమిస్ట్రీ కోర్సులో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. PAT విద్యార్థులందరూ మొదటి రోజు నుండి ఫైజర్ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పుడు పూర్తిగా తమ ఉద్యోగాలలోకి చేరుతున్నందున ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రస్తుతం, విశాఖపట్నంలోని ఫైజర్ తయారీ యూనిట్‌లో 340 మందికి పైగా మహిళా విద్యార్థులు PAT ప్రోగ్రామ్‌లో భాగమయ్యారు.
ఈ కార్యక్రమం గురించి ఫైజర్ వైస్ ప్రెసిడెంట్(సైట్ హెడ్) బి మురళీధర్ శర్మ మాట్లాడుతూ, “ఫైజర్ అటానమస్ టీమ్స్ (PAT) ప్రోగ్రామ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మా సిబ్బందితో చేరిన మొదటి బ్యాచ్ విద్యార్థులను చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. స్థానిక మహిళలకు అభ్యాస అవకాశాలను అందించడంతో పాటుగా సైన్స్, ఆరోగ్య సంరక్షణలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచాలనే మా నిబద్ధతలో భాగంగా, పాల్గొనే విద్యార్థులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఈ సాధికారత కార్యక్రమం అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క 94% రిటెన్షన్ రేటు- మూడు సంవత్సరాల క్రితం మాతో చేరిన 47 మంది విద్యార్థులలో 44 మంది ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్నారు- ఒక అద్భుతమైన విజయం , మోడల్ యొక్క బలానికి నిదర్శనం. మా విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యత గల అభ్యాస అనుభవాలను అందిస్తున్నప్పుడు మాతో కలిసి నడిచినందుకు మా భాగస్వామి - గీతం విశ్వవిద్యాలయానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.." అని అన్నారు.
గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎర్రోల్ డిసౌజా మాట్లాడుతూ, “ఈ ప్రత్యేకమైన కార్యక్రమం కోసం ఫైజర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. పని, సాధారణ విద్య మధ్య సమతుల్యత అనేది విద్యార్థుల ధైర్యంకు మాత్రమే కాదు, ఇది మీరందరూ కలిగి ఉన్న ధైర్యసాహసాలకు నిదర్శనం. విద్యా అభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమ అనుభవంతో కలపడం ద్వారా, ఈ కార్యక్రమం విద్యా-పరిశ్రమ సహకారం యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది. గీతం, ఫైజర్ సంయుక్తంగా రూపొందించిన పాఠ్యాంశాలలో ఫైజర్ నుండి తాజా సాంకేతిక అంశాలను కలిగి ఉంటే, విద్యార్థులు మొదటి నుండి ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించడానికి మా అధ్యాపకులు బోధిస్తారు. ఈ నమూనా, ఫార్మా పరిశ్రమ కోసం బలమైన, నైపుణ్యం కలిగిన ప్రతిభను నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ యువతులు తమ కలలను సాధించడంలో మద్దతు ఇచ్చిన కుటుంబాలను కూడా మేము అభినందిస్తున్నాము” అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆసియా-పసిఫిక్, ఆఫ్రికా & మిడిల్ ఈస్ట్ రీజియన్‌లోని పీపుల్ ఎక్స్‌పీరియన్స్, ఫైజర్ గ్లోబల్ సప్లై సీనియర్ డైరెక్టర్ రేష్మా పరిదా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిఎస్ఎస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. వేదవతి మరియు పిజిఎస్ ఇండియా పీపుల్ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ శ్రీ టి. రవి కిరణ్ కూడా హాజరయ్యారు. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్(DEI) ప్రయత్నాలకు మూలస్తంభంగా లింగ వైవిధ్యంతో కూడిన వైవిధ్యమైన, సమ్మిళిత కార్యాలయాన్ని నిర్మించడానికి ఫైజర్ కట్టుబడి ఉంది. PAT అనేది భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఇది స్థానిక మహిళలకు ప్రత్యేకమైన పని అనుసంధానిత సమగ్ర అభ్యాస నమూనాను అందించడంపై దృష్టి సారించింది, తద్వారా స్థానిక ప్రతిభను పెంపొందించడం, వారి వృద్ధికి తగినంత అవకాశాలను అందించడంపై దృష్టి పెట్టింది.