తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిగురుపాటిని హత్య చేసింది.. రాకేష్ మాత్రమే కాదని.. ఆయన హత్యోదంతంలో నలుగురి పాత్ర వుందని తాజాగా పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. జయరామ్‌ను హత్య చేసిన వారిలో ఐదుగురు బయటి వ్యక్తుల హస్తం కూడా వున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా జయరామ్ హత్య కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణలో పెనుగులాట, పిడిగుద్దుల వల్లే ఆయన మరణించాడని తెలిపింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు.