భారత్ 6జి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

బుధవారం, 22 మార్చి 2023 (16:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ 6జి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. కాల్ బిఫోర్ యు డిగ్ యాప్‌ను కూడా ఆయన ప్రారంభించారు. 6జి ఆర్ అండ్ డి టెస్ట్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. సమాచార విప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శగా ఉందని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2028-29 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 
 
6జీ రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఆయన ప్రారంభించారు. బుధవారం దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు కొత్త యేడాది వేడుకలను జరుపుకుంటున్నారని, ఈ శుభతరుణంలో 6జి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అతి తక్కువ ధరకే భారత్‌లో డేటా లభ్యమవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు. దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య కూడా బాగా పెరిగిందని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు