ఇందుకు ప్రతిగా 3,100 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా కేటాయించారు. అలాగే, రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు.
నిజానికి రికార్డులలో వీరు చూపిన ఆ భూమి నాగార్జున సాగర్ రెండు రోడ్లకు చెందినది. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ మాధురి తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణలో భాగంగా ఆమెను అరెస్టు చేశారు.