ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం... జేసీ ప్రభాకర్ రెడ్డి

శనివారం, 13 జూన్ 2020 (07:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమలో గట్టిపట్టున్న రాజకీయ నేతల్లో ఒకరైన జేసీ దివాకర్ రెడ్డి సోదరుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని హైదరాబాదు శివారు శంషాబాద్‌లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. 
 
వీరిద్దరూ నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు. 
 
నిజానికి జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు అంటే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే. వీరిద్దరూ జేసీ ట్రావెల్స్ పేరుతో ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు. అలాగే, లారీలు కూడా ఉన్నాయి. అయితే, ఒకే రిజిస్ట్రేషన్ నంబరుతో అనేక లారీలు, బస్సులు నడుపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలో రవాణా శాఖ అధికారులు చేసిన ఆరోపణల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు