అయితే మృతదేహం కోసం బుధవారం సాయంత్రం బంధువులు ఆస్పత్రికి రాగా మార్చురీలో మృతదేహం కనిపించకుండా పోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతదేహం మాయంపై ఆస్పత్రి వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మృతదేహం మిస్సవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డెడ్‌బాడీ కనిపించకుండా పోయిన ఘటన గాంధీ ఆస్పత్రి వద్ద కొంత ఆందోళనకు దారి తీసింది.
మరోవైపు, గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఆ ఆసుపత్రి ఫర్నిచర్‌ను కూడా అతను ధ్వంసం చేయడంతో వైద్యులు నిరసనకు దిగారు. దీనిపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.