వ్యభిచారం చేస్తూ అరెస్టై.. జైలుకెళ్లారు.. ఆపై వ్యభిచార గృహాన్నే నడిపారు.. కానీ..?

ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (12:31 IST)
వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. జైలుకు వెళ్లారు. జైలులో ముగ్గురు కలిసి మాట్లాడుకొని బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కొత్త తరహాలో ఒకే చోట చేరి వ్యభిచార గృహాన్ని నడపటం మొదలెట్టారు. పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించి వీరి వ్యవహారాన్ని రట్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కర్నూలు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేష్‌ నగర్‌లో ఓ వ్యభిచార గృహంపై సీఐ మధుసూదన రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ జయన్న, సిబ్బంది శనివారం రాత్రి దాడి నిర్వహించారు. పోలీసు రాకను గుర్తించిన వ్యభిచార నిర్వాహకులు మమత, సుధారాణి, సుమ అలియాజ్‌ ఫాతిమలు పరారయ్యారు. ముగ్గురు విటులు అనిల్‌, శీను, కళ్యాణ్‌లతో పాటు మరో యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి