నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో అమరావతి మహా పాద యాత్రకు ఆటంకం కలిగింది. దీనితో పోలీసుల తీరు నిరసనగా అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. పాదయాత్రలో సర్వ మతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను తమతో పంపాలని రైతులు ఆందోళన చేయడంతో ఇరువర్గాలకు మధ్య పోలీసులతో వాగ్వాదం జరిగింది.
రైతులకు పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజలు మద్దతు పలికారు. ఈ ఆందోళన, ధర్నాతో పొదలకూరు మార్గంలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి.
అమరావతి మహా పాదయాత్రకు నెల్లూరులో ఆటంకాలు కల్పించడం, భోజనాల ఏర్పాట్లను తొలగించటం క్షంతవ్యం కాదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఖండించారు. మహా పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఇది