చంద్రబాబుతో పీకే ఏం చర్చించారు...? వైకాపాలో అయోమయం!!

ఆదివారం, 24 డిశెంబరు 2023 (08:53 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయవాడకు వచ్చి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రశాంత్ కిషోర్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెంటబెట్టుకుని మరీ తీసుకెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసంలో ఈ ముగ్గురు నేతలు కలిసి ఏకంగా మూడు గంటల పాటు సుధీర్ఘమంతనాలు జరిపారు. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలు, ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి వంటి అనేక అంశాలపై వీరిమధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
 
ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పొత్తును ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, అందులోని అంశాలకు విస్తృత ప్రచారాన్ని కల్పించడం, ఇందుకోసం అనుసరించాల్సిన వ్యహాలను ఇందులో చర్చినట్టు తెలుస్తుంది. చంద్రబాబుతో భేటీ తర్వాత మళ్లీ లోకేశ్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఉండవల్లి నుంచి విజయవాడకు చేరుకున్నారు. 
 
గన్నవరం నుంచి హైదరాబాద్ నగరానికి తిరిగి వెళ్లే సమయంలో ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సీనియర్ రాజకీయ నేత అని, ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశాను అని పీకే ముక్తసరిగా వెల్లడించారు. అంతకుమించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ బృందంతో పాటు రాబిన్ శర్మ టీమ్ కలిసి పని చేస్తున్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు