హైదరాబాద్, మీర్జాలగూడలోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు అవధాని. మానసిక వికలాంగుడైన తన కుమారుడి ఆరోగ్యం బాగుపడేందుకు పూజ చేయాలంటూ అవధానిని ఓ వివాహిత ఆశ్రయించింది. కుమారుడు పేరుతో పూజ చేస్తానని నమ్మించి రూ. 60 వేలు వసూలు చేశాడు. నిత్యం వస్తున్న ఆమె గతాన్ని పూజారి తెలుసుకున్నాడు.
ఆమెకు మరో వ్యక్తితో ఉన్న పరిచయాన్ని అవకాశంగా మలుచుకోవాలనుకున్నాడు. ఆమెను లోబర్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమె భర్తకు, బంధువులకు బాధితురాలు ప్రవర్తనపై ఫోన్‌లు, మేసేజ్‌లు పంపిచాడు. విషయం తెలుసుకున్న భర్త ఆమెను నిలదీశాడు. ఇదిలావుండగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పూజారి కుట్ర భయపడింది.