తిరువళ్లకు చెందిన వివాహిత పెళ్లికి ముందు ఓ ఫాదర్‌తో సన్నిహిత సంబంధం ఉండేది. తన తప్పును ఆమె పెళ్లయిన తర్వాత పదే పదే తలచుకొని కుమిలిపోసాగింది. తన బాధను జీసస్ ఎదుట చెప్పుకొని సాంత్వన పొందేందుకు చర్చికొచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో ఫాదర్‌తో తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకుని కుమిలిపోసాగింది. ఆ మహిళ బలహీనతను ఆసరాగా చేసుకుని ఆ ఫాదర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ పరిస్థితుల్లో గత ఫిబ్రవరిలో తన భార్య మెయిల్‌కు ఓ హోటల్‌కు సంబంధించిన భారీ బిల్లు రావడంతో అనుమానించిన భర్త గట్టిగా అడిగే సరికి బాధితురాలు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐదుగురు ఫాదర్లను చర్చి నిర్వహణ కమిటీ సస్పెండ్ చేసింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.