అయితే, మంగళవారం వారిని ప్రత్యేకంగా ఒక గదిలోకి రప్పించి, 'మీరు ఫీజులు చెల్లించలేదు. మీ తల్లితండ్రులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. వేరే నెంబర్ల నుంచి మీరే ఫోన్ చేసి ఫీజులు కట్టాలని చెప్పండి. లేదంటే తరగతులకు హాజరు కానివ్వడం లేదని చెప్పండి' అంటూ విద్యార్థులతో ప్రిన్సిపాల్ లేఖా సురేశ్ ఫోన్లు చేయించారు.
దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఒక గదిలో దోషులుగా నిలబెట్టి ఉంచడం చూసి తట్టుకోలేకపోయారు. అక్కడున్న వారిని నిలదీయగా, ఈలోపు బ్రాంచ్ 3 ప్రిన్సిపాల్ శైలేశ్ అక్కడకు చేరుకుని తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగారు.