బోల్తాపడిన పైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. 20మందికి గాయాలు

శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (10:42 IST)
విజయవాడ, గొల్లపూడి సెంటర్‌ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు డివైడర్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. 
 
ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు