శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టటం ముదావహమన్న గవర్నర్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు.
భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుండగా, ప్రయోగం సఫలీకృతం చేసిన ప్రతి ఒక్క ఇస్రో శాస్త్రవేత్త అభినందనీయుడేనన్నారు.