పుట్టగొడుగులతో కరోనా యాంటీవైరల్ డ్రగ్

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (19:57 IST)
కరోనాకు మెడిసిన్ కోసం తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం దేశంలో పేరొందిన అనేక కంపెనీలు పరిశోధనలు జరుపుతున్న ఈ సందర్భంలో సంప్రదాయ పద్దతిలో కూడా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలయజేశారు.
 
సీసీఎంబీ, ఏఐసి సంయుక్తంగా తయారుచేసిన కరోనా ఎయిడ్ యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్టర్‌ విడుదల సందర్భంగా రాకేష్ మిశ్రా మాట్లాడారు. కరోనావైరస్ నుంచి రక్షించే రోగనిరోధక శక్తి, అత్యంత పోషక విలువలు కలిగిన పదార్థం
 
హిమాలయాల్లో లభించే కార్డిసేస్పెమిలాటరీస్ అనే పుట్టగొడుగుల్లో ఉంటుందని, పుట్టగొడుగుల్లో ఉండే పోషక విలువలకు, పసుపు పొడిని కలిపి ఈ కరోనా ఎయిడ్ తయారుచేశాం అన్నారు రాకేష్ మిశ్రా.
 
పుట్టగొడుగులతో యాంటివైరల్ ప్రాపర్టీ అభివృద్ధి చేయడం సంతోషకరం అని వైరస్ విరుగుడు కోసం అనేక కంపెనీలు ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్ డ్రగ్ రావడం సంతోషంగా ఉందన్నారు 
రాకేష్ మిశ్ర.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు