అతడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు తెలీయదు. అతడిని చూసి స్థానికులు అరుపులు కేకలు వేయడంతో ఉన్మాది చెలరేగిపోయాడు. ఇంతలో అతడు మెట్టు వద్ద గల ఓ టీ దుకాణం నిర్వాహకుడిని కత్తితో పొడవడంతో అక్కడనున్న వారు వెంటనే పట్టుకుని సైకోని గొడ్డును బాధినట్టుబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో ఉండడం చూసిన పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లి పోయారు.
అప్పటికే సైకో శరీరమంతా గాయాలతో రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సైకో మృతి చెందాడు. ఉన్నాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుల్లో నలుగురు కేజీహెచ్‌కు తరలించగా, ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైకో వీరవిహారం చేసిన ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు మెట్టు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.