మనస్పర్థలు కారణంగా కట్టుకున్న భర్తను, కన్నబిడ్డను వదిలి వచ్చిన ఓ డాన్సర్ కథ విషాదంగా ముగిసింది. నమ్మించి ప్రేమించి సహజీవనం చేసిన యువకుడే ఆమె ప్రాణాలు బలితీశాడు. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన బార్ డాన్సర్ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే...
కానీ, అతడేమో కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఇతరులతో ఆమె చనువుగా మాట్లాడుతోందని లోలోపల రగిలిపోయాడు. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. ఇంట్లోనే ఆమెను చేతులు కట్టేసి.. గొంతు నులిమి హత్య చేశాడు.
మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఇంటి నుంచి దట్టమైన పొగ రావడంతో ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సల్మాన్‌కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది.