వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బీజేపీ నేత పురంధేశ్వరి పోటీ చేయనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో రాజకీయంగా తన భవిష్యత్ కార్యాచరణ గురించి పురంధేశ్వరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ప్రత్యేకంగా హిందూపురం నుంచి పోటీ చేయాలని పార్టీ కేడర్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. అయితే పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
అలాగే ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, సినిమా తీస్తే ఆయన గౌరవాన్ని పెంచేలా ఉండాలి గానీ ఒక్క కోణంలో సినిమా తీయాలనుకోవడం సబబు కాదని పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమాపై ఆమె స్పందించారు.