చలించకుండా కుమార్తెల అంత్యక్రియలు చేసిన పురుషోత్తం నాయుడు

మంగళవారం, 26 జనవరి 2021 (18:19 IST)
జంట హత్యల కేసులో తండ్రి పురుషోత్తం నాయుడు మొదటి ముద్దాయి. మదనపల్లె పోలీసులు పురుషోత్తం నాయుడును మొదటి ముద్దాయిగా, తల్లి పద్మజను రెండవ ముద్దాయిగా నిర్థారించుకుని కేసు నమోదు చేశారు. ఇద్దరి మీద సెక్షన్ 302 కేసులు పెట్టారు. 
 
అయితే రెండురోజుల క్రితం హత్య జరిగితే ఈరోజు ఉదయం నిందితులను అరెస్టు చేశారు. తల్లిదండ్రుల మానసిక పరిస్థితి బాగాలేదన్న ఉద్దేశంతో పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. నిన్న అంత్యక్రియలకు హాజరైన తల్లిదండ్రుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు.
 
ముఖ్యంగా తండ్రి పురుషోత్తం నాయుడు మొదట్లో ఏడుస్తూ కూతుర్ల దగ్గరకు వెళ్లి అంత్యక్రియలు చేశారు. కానీ ఆ తరువాత మాత్రం తండ్రిలో ఏ మాత్రం బాధ కనిపించలేదు. ఈరోజు ఉదయం ఇద్దరికీ కోవిడ్ టెస్టులకు తీసుకెళ్ళేటప్పుడు కనీసం బాధపడుతున్నట్లు ఫేస్ కూడా లేదు. 
 
తల్లి పద్మజ ఏమో వింతగా ప్రవర్తిస్తే.. తండ్రి పురుషోత్తం నాయుడు మాత్రం ఏదో కాలేజీకి వెళుతున్నట్లుగా వెళ్ళి పోలీసు  జీపులో కూర్చున్నాడు. వీరిద్దరి ప్రవర్తన చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. పిల్లలను తమ చేతులతో తామే చంపేశామన్న బాధ వారిలో ఏ మాత్రం కనిపించలేదు. ఉన్నత చదువులు చదువుకున్న ఇద్దరు ఈ విధంగా ప్రవర్తించడం మాత్రం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు