ఏంటి అత్తకు కోడళ్లు గుడి కట్టారా? ఇదెలా సాధ్యం.. ఈ వార్తను అస్సలు నమ్మేది లేదు అని చాలామంది అంటారు. కానీ ఇది నిజం. అత్తాకోడళ్ల మధ్య సాధారణంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏ కారణం లేకుండానే తిట్టుకుంటారు. కానీ.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం అలా కాదు. బిలాస్ పూర్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో.. బిలాస్ పూర్- కోర్బా హైవే పక్కన ప్రపంచంలో ఎక్కడా లేని ఈ గుడి ఉంది. నిజమే కదా.. ప్రపంచంలో ఎక్కడైనా ఏ కోడలైనా అత్తకు గుడి కట్టిందా చెప్పండి.