ఎర్ర చందనం దుంగలుతో మంగళగిరి టోల్ ప్లాజా వద్ద దొరికిన Pushpa స్మగ్లర్

ఐవీఆర్

గురువారం, 5 డిశెంబరు 2024 (13:13 IST)
అల్లు అర్జున్ నటించిన Pushpa చిత్రం గురించి తెలిసిందే. అందులో పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇదే రీతిలో కొందరు స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి ఏపీ నుంచి ఎర్రచందనం దుంగల్ని దాటిస్తున్నారు.
 
తాజాగా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద ఎర్రచందనం దుంగలను తీసుకువెళ్తున్న లారీ పట్టుబడింది. పోలీసులు పక్కా సమాచారంతో లారీని ఆపి తనిఖీలు నిర్వహించారు. పేపర్ బండిళ్ల కింద 49 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇవి చెన్నై నుంచి అస్సాంకు తీసుకువెళ్తున్నట్లు తేలింది. వీటి విలువ కోటిన్నరకు పైగా వుంటుందని చెబుతున్నారు.

మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద ఎర్రచందనం లారీ పట్టివేత.లారీ సీజ్, డ్రైవర్ పరారీ.

పక్కా సమాచారంతో పోలీసులు పట్టివేత.
పేపర్ బండిల్స్ మధ్య 49 ఎర్రచందనం దుంగలు.

చెన్నై నుండి అస్సాంకు వెళ్తున్న ఎర్రచందనం..
బహిరంగ మార్కెట్లో వీటి విలువ కోటిన్నర. pic.twitter.com/SRlJKVZkDv

— Sreekanth (@sreekanth324) December 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు