తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడు వేదికగా వైఎస్సార్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు సమరశంఖం పూరించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు కొత్త నినాదం ఇచ్చారు. "క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ (జగన్‌ను వదిలించుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకుందాం) అని చంద్రబాబు నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.