వచ్చే ఎన్నికల తర్వాత తెదేపా ప్రభుత్వం ఏర్పాటు తథ్యం : ఆర్ఆర్ఆర్ సర్వే

మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:24 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను చేయించిన సర్వేలో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సర్వే చేయించానని తెలిపారు. తన సర్వేలో ప్రజల మొగ్గు తెదేపా వైపే ఉందని చెప్పారు. టీడీపీకి 90కి పైగా స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 
 
అదేసమయంలో ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలను నమ్మరాదని ఆయన వైకాపా శ్రేణులకు హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ హవా కనిపిస్తుందని రఘురామ రాజు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తన సర్వేలో వెల్లడైందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు