ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత నీచస్థితికి దిగజారిపోయాయి. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డారు. అయితే, ఈ దాడులకు ప్రధాన కారణంగా పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చేసిన బోసడీకే అనే పదంమే.
'టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్‌లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. సర్.. మీరు బాగున్నారా అనేది సంస్కృతంలో బోసడీకే అనేదానికి అర్థం' అని రఘురామ రాజు వివరించారు.