మూవీ మేకర్స్ ఒక కీలకమైన కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. శోభగా శిల్పా శిరోద్కర్ ని పరిచయం చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఆమె బ్లాక్ చీర కట్టుకుని, హోమగుండం ముందు కూర్చొని కనిపించారు. ఆ పోస్టర్ మొత్తం మిస్టికల్ ఎనర్జీతో తాంత్రిక శక్తులని సింబలైజ్ చేస్తోంది. శిరోద్కర్ ఇచ్చిన ఇంటెన్స్, సీరియస్ ప్రెజెన్స్ సినిమా సూపర్‌నాచురల్, స్పిరిచువల్ టోన్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయింది.
జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో., క్రియేటివ్ డైరెక్షన్ దివ్య విజయ్. జీ స్టూడియోస్ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో, ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుుణ అగర్వాల్, శిల్ప సింగాల్, కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ ప్రాజెక్ట్ కు మద్దత్తు ఇస్తున్నారు. టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, పరి వంటి హిట్స్ ఇచ్చిన ప్రెర్ణా అరోరా మళ్లీ హై-కాన్సెప్ట్ సినిమాను రూపొందిస్తున్నారు.