ఫైల్‌ను పేపర్‌లా చూడొద్దు.. మనిషి జీవితంగా భావించండి: నరసింహన్

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:06 IST)
ఒక ఫైల్‌ను పేపర్‌లా చూడొద్దు.. అది ఒక మనిషి జీవితంగా భావించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ హితవు పలికారు. శుక్రావరం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థలో గ్రూప్‌-1ట్రైనీల వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 
 
మీరూ పౌరులని భావిస్తేనే వాళ్ల కష్టాలు తెలుస్తాయన్నారు. ప్రతి యేటా మొక్కలు నాటడం కాదని.. అవి బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారతీయులుగా ఉన్నందుకు గర్వపడండని.. నిజాయితీగా పని చేయాలని గవర్నర్‌ నరసింహన్ స్పష్టంచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు