‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్, తదితర సభ్యులతో ‘మా’ పూర్వ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతినెలా 50 మంది పేద కళాకారులకు పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం ఫిలిం చాంబర్లో జరిగింది.